మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (08:46 IST)

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం - 15 మందికి గాయాలు

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.