గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:46 IST)

హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు కూలీల మృతి

road accident
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న అశోక్ ట్రాలీ వాహనాన్నీ లారీ ఢీకొనడంతో ఏర్పడిన ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
వివరాల్లోకి వెళితే.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ట్రాలీని ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.