సంబంధిత వార్తలు
- చిత్తూరు జిల్లాలో దారుణం : లోయలోపడిన బస్సు - ఏడుగురు మృతి
- గాల్లోకి ఎగిరిన ఎమ్మెల్యే కారు.. ప్రాణాలతో బయటపడిన వైనం
- నెల్లూరు జిల్లాలో ఘోరం : ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- నల్గొండ వైద్య కాలేజీకి మల్లు స్వరాజ్యం పార్థివదేహం
కామారెడ్డిలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎం) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్ ఒకటో డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
బస్సు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కారులోని మరో బాలిక తీవ్రంగా గాపయడింది. ఆ బాలికను ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
