శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నల్గొండ వైద్య కాలేజీకి మల్లు స్వరాజ్యం పార్థివదేహం

ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విప్లవ స్వరం, మాజీ ఎమ్మెల్లే మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండకు తరలించనున్నారు. ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు పార్థివదేహాన్ని నల్గొండ వైద్య కాలేజీకి అప్పగిస్తారు.
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎంబీ భవన్‌లో మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఎం నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఉదయం 9.30 గంటలకు మల్లు స్వరాజ్యం భౌతికకాయం నల్గొండకు తరలిస్తారు. 
 
ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర సాగనుంది. మల్లు స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని కుటుంబీకులు అప్పగించనున్నారు.