ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (08:36 IST)

నేడు సిరివెన్నెల అత్యంక్రియలు.. ఏపీ ప్రతినిధిగా మంత్రి పేర్ని నాని

ఊపిరితిత్తుల కేన్సర్ కారణంగా అస్తమించిన సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలుగు సినీ  పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన సిరివెన్నెల ఆకాల మరణం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. మంగళవారం సాయంత్రం కన్నుమూసిన ఆస్పత్రి కిమ్స్‌లో ఆయన భౌతికకాయాన్ని వుంచారు. 
 
బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.