సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (16:49 IST)

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు....

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు. ఆయన మంగళవారం 4.14 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. నిజానికి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన సినీ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఒక కవిగా, సినీ పాటల రచయితగా నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సిరివెన్నెల చిత్రం ద్వారా ఆయన సినీ రంగం ప్రవేశం చేశారు. ఆ చిత్రంలోని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు.