సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (14:13 IST)

జూనియర్ మమ్మల్ని నియంత్రించడమేంటి : మంత్రి కొడాలి నాని

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆయన మమ్మలను నియంత్రించడమేంటి అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై కొడాలి నాని మాట్లాడుతూ, ఏపీలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన మయం చేస్తూ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దీనిపై తెలుగు చిత్రపరిశ్రమలో మిశ్రమ స్పందనవుందన్నారు. అయితే, వైకాపా నేతలను జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను మంత్రి నాని కొట్టిపారేశారు.
 
ఆయన చెబితే నేను, వంశీ వింటామా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు కలిసేవున్నాం.. విభేదాలతో బయటకు వచ్చేశామన్నారు. అదేసమయంలో నందమూరి ఫ్యామిలీ అంటే తమకు గౌరవం ఉందన్నారు. అయితే, చంద్రబాబును ఆ కుటుంబం ఇంకా నమ్ముతోందని, ఇది విచారించదగ్గ విషయమన్నారు. 
 
అంతేకాకుండా, తాను, వంశీ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలివేసి వస్తామని, అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా వదిలివేసి రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు.