గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (14:23 IST)

ప్రెస్‌మీట్‌లోనే కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటీ?.. బాబుపై నాని ఫైర్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నాటకాన్ని బాగా రక్తికట్టించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టిడిపి ఎమ్మెల్యేలు నిరూపించగలరా..? అంటూ ప్రశ్నించారు. సభలో ఏం వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని... అవమానించేలా మాట్లాడితే చొక్కా పట్టుకోవాలి కదా.. అంటూ వ్యాఖ్యానించారు.
 
శాసనసభ నుంచి వెళ్లిపోయి... ప్రెస్‌మీట్‌లోనే కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటీ?' అంటూ ప్రశ్నించారు. సభలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిష్టిబొమ్మలకు బదులు చంద్రబాబును తగలబెట్టాలంటూ నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టిడిపి నుండి గెంటేస్తే ఆ పార్టీకి దరిద్రం వదిలిపోతుందంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.  
 
భువనేశ్వరిపై ఫలానా సభ్యుడు వ్యాఖ్యలు చేశారని ఒక్కరైనా నిరూపించగలరా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు చివరకు కుప్పం మున్సిపాలిటీలోనూ టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక భార్యను అడ్డుపెట్టుకుంటున్నారు. రాజకీయ అవసరాల కోసం దిగజారిపోయారంటూ దుయ్యబట్టారు.