గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 నవంబరు 2021 (13:14 IST)

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందా?

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయన ఆరోగ్యం విషమంగా వున్నట్లు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు.

 
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యనారాయణ పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. పౌరాణిక, జానపద, సాంఘిక, హాస్య, విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించారు.

 
వయోభారంతో గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా వుందని తెలిసి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.