1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (12:54 IST)

ప్రియుడితో న‌య‌న తార పుట్టిన రోజు వేడుక‌, స‌మంత కూడా...

ఇద్ద‌రూ ఒక సెట్లో ప‌ని చేస్తున్నారు.... అందులోనూ ఒక‌రికొక‌రు బెస్టీలు, ఇక బ‌ర్త్ డే అకేష‌న్ వ‌స్తే ఆగుతారా?  ఫుల్ జోష్! నయన తార పుట్టిన రోజు సందర్భంగా సినిమా షూటింగ్ సెట్ లో జ‌ర‌గిన సంద‌డి ఇది. ఆ ఇద్ద‌రు బెస్టీలు ఎవ‌రో కాదు... న‌య‌న‌, ఆమె బాయ్ ఫ్రెండ్, వారితో క‌లిసిన స‌మంత చేసిన సంద‌డి ఇది. 

 
న‌య‌న‌తార బర్త్ డే ‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ సెట్స్ లో సంద‌డిగా సాగింది. ఆమెకు ప‌లువురు అభిమానులు విషెస్ చెప్పారు. కానీ, న‌య‌న‌తార బాయ్ ఫ్రెండ్, ల‌వ‌ర్  కోలీవుడ్ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. స‌డ‌న్ గా కేక ప‌ట్టుకుని వ‌చ్చి, న‌య‌న తార‌ను హ‌గ్ చేసుకుని, ఆమెతో సెట్ లోనే కేక్ కోయించాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, సెట్ అంతా ఆమెను అభినందించారు.


అదే మూవీలో కో యాక్ట‌ర్ గా ఉన్న స‌మంత కూడా చాలా హుషారుగా న‌య‌న తార‌కు విషెస్ చెప్ప‌డ‌మే కాదు, ఆమె ల‌వ‌ర్ విగ్నేష్ శివన్ ని ప్రోత్స‌హిస్తూ, కేకు ముక్క వాళ్ళ నోటికి అందించింది. న‌య‌న తార, ఆమె ప్రియుడు సెట్స్ లో అంద‌రి ముందు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. అవ‌న్నీ చూస్తూ, స‌మంత ఎంతో థ్రిల్ అయిపోయింది. వారిద్ద‌రినీ ప్రోత్స‌హిస్తూ, క్లాప్స్ కొడుతూ... వారి ల‌వ్ స్టోరీని ఎంక‌రేజ్ చేసింది. ద‌టీజ్ స‌మంత‌.