గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (13:06 IST)

అందమే ఆమెకు ఆయుధం.. పెళ్లి చేసుకుని శోభనం రోజు రాత్రి..?

అందమే ఆమెకు ఆయుధం. అంతే ఆ అందంలో ఓ ముఠాను ఏర్పరిచి.. యువకులను మోసం చేసి భారీగా డబ్బులు గుంజేసింది. అయితే పోలీసులకు ఆమెతో పాటు ముఠా కూడా చిక్కింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది 
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ మహిళ పెళ్లికాని యువకుల్ని, రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే మగవారిని టార్గెట్ చేస్తుంది. స్నేహం పేరుతో మెళ్లగా వారికి దగ్గర అవుతుంది. ఆ పరిచయాన్ని కాస్త పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఈ మోసంలో ఆమె ముఠా ఆమెకు సాయం చేస్తారు. 
 
ఇక యువకుల్ని నమ్మించిన తర్వాత.. పెళ్లి చేసుకుంటుంది. ఇక ఫస్ట్ నైట్ రోజు భర్తకు మత్తుమందు ఇచ్చి తన పని కానిస్తుంది. అక్కడ ఉన్న బంగారం, డబ్బుతో ఉడాయిస్తుంది. ఇలా ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఇందులో నాలుగవ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు కిలాడీ మహిళను, ఆమె ముఠా సభ్యుల ఆట కట్టించారు. అందరిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.