సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (11:14 IST)

ప్రియుడి కళ్ళెదుటే ప్రియురాలిపై అత్యాచారం

ప్రియుడి కళ్లెదుటే ప్రియుడిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలని అరుబ్బుకోటకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఈ నెల 23వ తేదీన బీచ్‌కు వెళ్లింది. వారిద్దరూ సముద్రపు ఒడ్డున కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చిన యువకుడిని చావబాదారు. ఆ తర్వాత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ధరించిన నగలను దోచుకుని పారిపోయారు. 
 
ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్‌లను అరెస్టు చేసేందుకు వెళ్లగా వారిపై దాడి చేసి పారిపోయారు.