వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్తను అలా హత్య చేశాడు..
వివాహేతర సంబంధాల కారణంగా వివాహ వ్యవస్థపై వున్న నమ్మకం జనాలకు రోజు రోజుకీ తగ్గిపోతుంది. వివాహం అయినా అక్రమ సంబంధాలు నెరపే వారి సంఖ్య పెరగడం తద్వారా నేరాల సంఖ్య కూడా పెరుగుతూ పోవడం ప్రస్తుతం సహజమైపోయింది.
తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలు భర్తను ప్రియుడు హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కామాక్షికి చెందిన సెల్వరాజ్(35)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే, తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు హతమార్చాడు.
ఆటోకు నిప్పు పెట్టి సెల్వరాజ్‌ను బయటకు రప్పించి.. వెనుక నుంచి భార్య ప్రియుడితోపాటు నలుగురు వ్యక్తులు అతడి గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.