గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (16:08 IST)

బీర్ బాటిల్‌తో బస్సులో తాగుతూ కనిపించిన విద్యార్థినులు.. ఎక్కడ?

తమిళనాడులో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులోనే  పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో మద్యం సేవించారు. ఈ గ్రూపులోని ఓ విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. 
 
ఈ వీడియోలో విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి, తాగుతున్నట్లు  క‌నిపించింది. బ‌స్సులో మ‌ద్యం సేవిస్తున్న స‌మ‌యంలో వారంతా స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్నారు. 
 
వీరంతా చెంగ‌ల్‌ప‌ట్టులోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థుల‌ని తెలుస్తోంది. ఇది కూడా పాత వీడియో అని సమాచారం. 
 
ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో జిల్లా విద్యాధికారి స్పందించారు. ఈ విష‌యం అధికారుల దృష్టికి వెళ్లింద‌ని, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు.