తమిళనాడు మంత్రి కుమార్తె ప్రేమ పెళ్లి.. భద్రత కావాలంటూ విజ్ఞప్తి
తమిళనాడుకు చెందిన మంత్రి శేఖర్ బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తాను ప్రేమ వివాహం చేసుకున్నానని.. తనకు తన భర్తకు ప్రాణహాని వుందని.. పోలీసుల భద్రత అవసరమని బెంగళూరు పోలీస్ కమిషనర్ వద్ద వినతి పత్రం అందజేసింది.
తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలో ఉంది. ఆయన కేబినెట్‌లో శేఖర్ బాబు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె జయకళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకే తనకు, తన భర్తకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేసింది.
"నేను, నా భర్త 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ప్రస్తుతం ఇద్దరి ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం. కాబట్టి నా భర్తను, అతని కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు. తమిళనాడు పోలీసులు నాకు తగిన రక్షణ కల్పించాలి" అని కోరింది.