1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (17:16 IST)

ప్రమాణ స్వీకార సమయంలోనే అనారోగ్యంతో జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చనిపోయారు. ఆమె 60 రోజులకుపైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. అయితే, ఆమె మృతిపై పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయి. వీటిపై నిగ్గు తేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలుగా విచారణ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో జయలలితకు చికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన అపోలో డాక్టర్ బాబు మనోహర్ సంచలన విషయాలను జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు వెల్లడించారు. 
 
2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే జయలలిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని, ఆమె తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేదని తెలిపారు. దీంతో జయలలితను మరింత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశామని తెలిపారు. రోజుకు 16 గంటల పాటు పని చేస్తున్నందున విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టమని జయలలిత చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబరు 5వ తేదీ 2016న గుండెపోటు వచ్చి మరణించారని వెల్లడించారు.