గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 29 మార్చి 2022 (12:03 IST)

తెలంగాణాలో వరుస రోడ్డు ప్రమాదాలు

తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉండటంతో పాటు డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
తాజాగా యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
మరోవైపు, మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. గేదెను తప్పించబోయిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదవశాస్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె చనిపోయింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సు కామారెడ్డి నుంచి భద్రాచలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.