మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (19:24 IST)

ప్రయాణీకులకు మరో షాక్: పెరిగిన బస్ పాస్ ధరలు

ప్రయాణీకులకు మరో షాక్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. బస్ పాస్ ధరలను భారీగా పెంచేసింది.  జనరల్ ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970 నుంచి రూ.1150కి పెంపునట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర రూ.1070 నుంచి రూ.1300 చేసినట్లు వెల్లడించింది. 
 
ఇక మెట్రో డీలక్స్ ధర రూ.1185 నుంచి రూ.1450కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధర రూ. 1100 నుంచి రూ.1350కి పెంచారు.  
 
పుష్పక్ ఏసీ పాస్ ధర గతంలో రూ.2500 ఉండగా..ప్రస్తుతం రూ.3000‌కు చేరింది. పెరిగిన బస్ పాస్ ధరలు శుక్రవారం నుంచి అమలు అవుతాయని టీఎస్సార్టీసీ వెల్లడించింది.
 
ఇప్పటికే.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్‌ చేశారు. అలాగే  సెస్ పేరిట ఎక్స్​ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. తాజాగా బస్సు పాస్ ధరలు కూడా పెరిగిపోయాయి.