గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:22 IST)

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం

road accident
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మిరపకాయల కోతకు వెళుతున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా బాధితులే కావడం గమనార్హం. 
 
మిరపకాయల కోత కోసం పత్తిపాకకు చెందిన చెందిన కొందరు కూలీలు ఒక ఆటోలో వెళుతున్నారు. ఈ ఆటోను మాందారిపేట వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మృతులను మంజుల (45), రేణుక (48), విమర (50)గా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.