గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:58 IST)

రెప్పపాటులో దూసుకొచ్చిన లారీ... క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం

road accident
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో రెప్పపాటులో దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టి ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి సంబధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రామాంతపూర్‌కు చెందిన పున్నగిరి, ఆయన భార్య కమల అనే భార్యాభర్తలిద్దరూ బైకుపై రోడ్డుకు ఓ వైపున వెళుతున్నారు. వెనుక నుంచి రెప్పపాటులో దూసుకొచ్చిన లారీ ఒకటి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్ అదుపు తప్పింది. దీంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. క్షణాల్లో ఆ లారీ మహిళ తలపై దూసుకెళ్లింది. 
 
రామాంతపూర్ చర్చికి ఎదురుగా ఈ ఘోరం జరిగింది. పున్నగిరి స్వల్ప గాయాలతో ప్రాణాల నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదం సీసీటీవీలో నమోదయ్యాయి. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.