1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nattikumar opened his mouth on the allegations

న‌ట్టికుమార్ ఆరోప‌ణ‌ల‌పై నోరు విప్పిన వ‌ర్మ‌

Ram Gopal Varma
Ram Gopal Varma
త‌న‌పై  నట్టి కుమార్ చేసిన ఆరోప‌ణ‌లపై రామ్ గోపాల్ వర్మ ఈరోజు క్లారిటీ ఇచ్చాడు. చిన్న వీడియో బైట్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. న‌ట్టికుమార్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏదైనా వుంటే నా లాయ‌ర్లు చూసుకుంటారు. కాదు వేరేలా చూడాల్సిన అవిస‌రం వుంటే నేను వేరేలా చూస్తాను. త‌ను నా గురించి ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాడు. అది త్వ‌ర‌లో తెలుస్తుంది. ఆయ‌న గురించి అంద‌రికీ తెలుసు. ప్ర‌తీదానికి ప్రెస్ మీట్ పెట్టి చెబుతుంటాడు. ఒక‌ప్పుడు చిరంజీవి, డి.సురేష్‌బాబు వంటివారిపై ఇలానే చేశాడు.
 
ఇక నా గురించి చెప్పాడు. త‌న కొడుకు, కూతురు సినిమా తీస్తే నేను ప్ర‌మోట్ చేయ‌లేద‌ని ఇలాంటి ఫిట్టింగ్‌లు పెడుతున్నాడు. అలాగే డేంజ‌ర‌స్ సినిమా ఆగిపోవ‌డానికి ఆయ‌న స్టే తేవ‌డానికి పొంత‌నేలేదు. సినిమా ఆగిపోవ‌డం అనేది యాదృశ్చికం. త్వ‌ర‌లో ప‌రిష్కారం అవుతుంది. ఈరోజునుంచి ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌ను. ఏది చేసినా లీగ‌ల్‌గా చూసుకుంటాన‌ని పేర్కొన్నాడు.
About Writer
డీవీ
తర్వాతి కథనం
భవదీయుడు భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ బద్దల్ అవ్వాల్సిందే అంటున్న హ‌రీశ్ శంక‌ర్‌