శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:32 IST)

బడా హీరోలతో సినిమాలు తీసే ఓపిక నాకు లేదు : ఆర్జీవీ

ram gopal varma
పెద్ద హీరోలతో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం తనకు లేవని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పైగా, తాను నిర్మించే చిత్రం ఎంత బడ్జెట్‌లో చేశాననే విషయాన్ని మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన తెరకెక్కించిన "మా ఇష్టం" (డేంజరస్) చిత్రం శుక్రవారం విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పెద్ద హీరోలు, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసే ఓపిక, సామర్థ్యం, తపన తనకు లేవన్నారు. తనను ఆసక్తికి గురిచేసే అంశాలతోనే సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. తాను తీసే చిత్రాన్ని ఎంతమంది చూశారు, ఎలా వుంది అన్నదానికంటే ఎంత బడ్జెట్‌లో తీశానన్న విషయాన్ని మాత్రమే ఆలోచన చేస్తానని చెప్పారు. పైగా, ఇప్పటివరకు తాను తీసిన చిత్రాన్ని లాభాలను తెచ్చి పెట్టాయని, అందుకే తాను సినిమాలు తీయగలుగుతున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే తాను తాజాగా నిర్మించి "మా ఇష్టం" చిత్రం స్వలింగ సంపర్కుల గురించి అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా 377 ఆర్టికల్‌ను రద్దు చేసిందని గుర్తు చేసింది. పైగా, ఎప్పటినుంచి స్వలింగ సంపర్కుల గురించి మాట్లాడుకుంటున్నామని, వారు కూడా మనుషులేనని చెప్పారు. 
 
అయితే, తాను ఆ అంశాల జోలికి వెళ్లలేదన్నారు. కానీ ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్ ఎందుకు అయ్యారన్న అంశాన్ని మాత్రమే చూపించానని చెప్పారు. ఇందులో యాక్షన్ సీన్స్‌ ఎక్కువగానే ఉన్నాయన్నారు. పైగా, ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను కూడా చిత్రీకరించామని, ఇలాటి సాంగ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు.