సంబంధిత వార్తలు
- రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన థియేటర్ యజమానులు
- వారి పేరెంట్స్ మాట్లాడి రొమాంటిక్ షూట్ చేశా- -రామ్ గోపాల్ వర్మ
- రామ్గోపాల్ వర్మ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దహనం’ ట్రైలర్ విడుదల చేసిన ఎంఎక్స్ ప్లేయర్
- కేసీఆర్ బయోపిక్ ఖాయం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా..?
- మా ఇష్టం చిత్ర హక్కులు పొందిన రామసత్యనారాయణ
అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు - రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma
- మా ఇష్టం సినిమా గురించి
ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్ నుండి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే మా ఇష్టం. ఇందులో లెస్బియన్స్ గా లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు.
ఇలాంటి సినిమాలు తీస్తే కాంట్రవర్సీస్ వస్తాయి కదా వాటిని మీరు ఎలా తీసుకుంటారు?
నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను, నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను.
శివ మూవీ నుండి మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇలాంటి మూవీ చేయడం వల్ల వారు డినప్పయింట్ అవుతారు కదా?
నేను ఒక కొన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా వినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను.
ఇందులో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ?
ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.
పెద్ద హీరోలతో హై బడ్జెట్ మూవీ ని మీ నుంచి ఎక్స్ పెక్ట్ చేయచ్చా?
నానుండి పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను
ఇతర దర్శకులు సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. మీరు ఫాస్ట్ గా తీయడానికి గల కారణం ఏంటి?
అది డైరెక్టర్ పనితనాన్ని బట్టి ఉంటుంది.
ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణమేంటి?
ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా తీయడం నేనే మొదటిసారి
సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి?
సోషల్ మీడియాకు బారికేడ్స్ లేవు.90% సోషల్ మీడియా మన దగ్గర ఆలోచన రాకముందే వారు వారికి చెప్పినట్టు పెట్టేస్తున్నారు. నేను వాటిని పట్టించుకోను.
మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి?
ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో, చైనా మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాము జూన్ లో రిలీజ్ అవుతుంది, కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి.
