గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:20 IST)

రామ్‌గోపాల్ వ‌ర్మ, మా ఇష్టం విడుద‌ల‌కు కోర్టు బ్రేక్‌

Ram Gopal Varma
Ram Gopal Varma
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా లెవ‌ల్లో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను వెంటేసుకుని దేశ‌మంతా తిరిగి వ‌చ్చిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఇద్ద‌రు అమ్మాయిల ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కించిన ఈ సినిమాను థియేట‌ర్ల‌లో ఆడించేది లేద‌నీ మ‌ల్లీప్లెక్స్ వారు తీర్మానించేశారు. ఇప్పుడు అది మామూలు థియేట‌ర్ల‌కు పాకింది. మ‌న క‌ట్టుబాట్ల‌కు వ్య‌తిరేకంగా సినిమా తీసి ఇదేదో క‌ళాఖండంగా చెప్పుకోవ‌డం సిగ్గ‌చేట‌ని పంపిణీదారులు ప్ర‌శ్నిస్తున్నారు.
 
తాజాగా వైజాగ్‌కు చెందిన నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్‌, పంపిణీదారు న‌ట్టికుమార్ కోర్టు నుంచి స్టే తెప్పించారు. ఈ సినిమాను ఆడనీయ‌మ‌ని తేల్చిచెప్పారు. 
 
రాంగోపాల్ వర్మ రూపొందించిన ^మా ఇష్టం^ ( డేంజరస్) KHATRA ( హిందీ) మూవీ విడుదలపై కోర్ట్ స్టే ఇచ్చింది. ఈ నెల 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రాంగోపాల్ వర్మ సన్నాహాలు చేస్త్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కు వెళ్లి ఈ చిత్రం విడుదలను నిలుపుదల చేయిస్తూ కోర్ట్ స్టే ఆర్డర్ తీసుకుని వచ్చారు. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుందని
 
వాయిదా వేస్తున్నా.
ఇక చేసేది లేక వ‌ర్మ వెన‌క్కి త‌గ్గారు. మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను అంటూ   రామ్ గోపాల్ వర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.