గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:32 IST)

చిరంజీవి సినిమా చేయలేక‌పోయానే అంటూ ఇప్పటికి బాధపడుతున్నా - ఉపేంద్ర‌

Upendra, Varun Tej, Allu Bobby, Sai Manjrekar,  Upendra, Allu arvind
Upendra, Varun Tej, Allu Bobby, Sai Manjrekar, Upendra, Allu arvind
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ నేప‌థ్యంలో గ‌ని సినిమాకు సంబంధించిన రిలీజ్ పంచ్ ఈవెంట్ ని హైద‌రాబాద్ జే ఆర్ సి క‌న్వేన్ష‌న్స్ లో మెగా అభిమానులు సమ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ తో పాటు క‌న్న‌డ స్టార్ హీరో ఉపెంద్ర‌, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు, చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు, త‌దిత‌ర‌లు పాల్గొని, ఈ సినిమాను అభిమానుల‌తో పాటు సాధ‌ర‌ణ ప్రేక్షకులు అద్భుత విజ‌యాన్ని చేకూర్చాల‌ని కోరారు. అలానే అభిమానులే ముఖ్య అతిధులుగా అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ గ‌ని సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ క‌ట్ టైల‌ర్ ని కూడా విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం మెగా అభిమానులను ఆక‌ట్టుకుకోవ‌డ‌మే కాకుండా సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్ని నుంచి అనూహ్య‌మైన స్పంద‌న అందుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 8న గ‌ని సినిమా భారీ రేంజ్ లో థియేట‌ర్లలో విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్షుక‌ల్ని అల‌రించేందుకు సిద్ధంగా ఉంది.
 
అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ, గ‌ని చిత్రాన్ని మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనొచ్చు, ఎందుకుంటే ఈ సినిమాలో అంద‌రూ హీరోలే, ఉపేంద్ర‌గారు, సునీల్ శెట్టిగారు, జ‌గ‌ప‌తిబాబుగారు, న‌వీన్ చంద్ర‌గారు ఇలా హీరోలంతా క‌లిసి ఈ సినిమా కోసం వ‌చ్చి నిల‌బ‌డ్డారు. సినిమాకు వారి ఫుల్ ఎఫ‌ర్ట్ పెట్టి న‌టించారు. ఈ మ‌ధ్య‌న థ‌మన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లు అవుతున్నాయి, వాటి స‌ర‌స‌న గ‌ని కూడా చేరుతుంద‌ని నేను భావిస్తున్నాను. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గకుండా ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు బాబి, సిద్ధూ. ఈ సినిమాకు ఇద్ద‌రు చాలా ముఖ్యం ఒక‌టి వ‌రుణ్ ఇంకొక‌రు కిర‌ణ్, వీరిద్ద‌రూ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అన్ని తామై సినిమాకు ముందుకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 8న విడుద‌ల అవ్వ‌బోతున్న ఈ సినిమా త‌ప్ప‌క ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌నే నమ్మ‌కం నాకు సంపూర్ణంగా ఉంది.
 
వరుణ్ తేజ్ మాట్లాడుతూ..  ద‌ర్శ‌కుడు కిర‌ణ్ నాతో 4 ఇయ‌ర్స్ నుండి ట్రావెల్ అయ్యాడు. ఈరోజు గ‌ని సినిమా చూసిని త‌రువాత నా న‌మ్మాకం నిజ‌మయ్యింద‌ని న‌మ్ముతున్నాను. కిర‌ణ్ బాగా చేశాడు. నేను నిజంగా క‌రెక్ట్ ఛాయిస్ తీసుకున్నాను. కిర‌ణ్ కి చాలా మంచ‌యి ఫ్యూచ‌ర్ వుంటుంది.  జార్జ్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. ర‌వింద‌ర్ ఆర్ట్‌, అబ్బూరి ర‌వి గారు మాట‌లు ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.
 
ఉపేంద్ర మాట్లాడుతూ, గత 24 ఏళ్లుగా నేను తెలుగువారందరికీ బాగా తెలుసు. హీరో రాజశేఖర్‌తో దాదాపు పాతికేళ్ల క్రితం 'ఓంకారం' అనే సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి అశ్వినీదత్ గారు నిర్మాత. కానీ నేను ఆ చిత్రాన్ని చేయలేకపోయాను. చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికి బాధపడుతుంటాను. ఆ తర్వాత ఒక్కమాట చిత్రంలో వరుణ్ తేజ్ ఫాదర్ నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిలో కీలక పాత్రలో నటించాను. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం చూశాను. ఆ సినిమాలో వరుణ్ తేజ్కీ.. ఇప్పుడు చూస్తున్న వరుణ్ తేజ్ అసలు సంబంధం లేదు అన్నట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన మేకోవర్ అంటూ ఉపేంద్ర ప్రశంసించారు.