బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:11 IST)

చెన్నై జీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

gh hospital
చెన్నై నగర నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఆస్పత్రిలోని కాలేయ చికిత్సా విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్‌లోని గ్రౌండ్ ఫ్లోరులో ఈ ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్‌లోని ఓ గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సభవించలేదు. కానీ వార్డులోని పరికరాలన్నీ పూర్తికా గాలిపోయాయి.
 
కాగా, ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం లేదని ఆయన వెల్లడించారు.