1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:32 IST)

సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ నోటీసులు

ilayaraja
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ కింద 1.8 రూపాయల మేరకు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులను జీఎస్టీ చెన్నై శాఖ కార్యాలయం జారీచేసింది. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇప్పటికే ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడుసార్లు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాగా మరోమారు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‍తో పోల్చుతూ ఇళయరాజా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనకు జీఎస్టీ చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.