బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (17:11 IST)

Earth day 2022: భూగ్రహాన్ని రక్షించండి.. భూతాపాన్ని తగ్గించండి..

World  Earth Day 2022
World Earth Day 2022
ఎర్త్ డేను ధరిత్రి దినోత్సవం, భూదినోత్సవంగా పిలుస్తున్నారు. ఈ దినాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి "ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్‌డే"గా మార్చింది. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారంతో ఎర్త్ డేని జరుపుకుంటారు. భూ గ్రహాన్ని రక్షించే చర్యలను ప్రారంభించాల్సిన అవసరాన్నిఈ రోజు గుర్తింపును తెలియజేస్తోంది. 
 
పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫ్లోరో కార్బన్‌ వంటి హానికారక వాయువులు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. భూతాపం పెరగడంతో పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ముప్పుగా పరిణమించాయి. 
 
వృక్షాలను విచక్షణారహితంగా కూల్చివేయడంతో అడవులు అంతరించిపోతున్నాయి. వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ అంతరించి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 
 
అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది. దీంతో భూ పరిరక్షణ ఎంత అవసరమని పేర్కొనేందుకే ఎర్త్ డేను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.