గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:58 IST)

సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఎంత ప‌నిచేసింది!

Krishna latest
Krishna latest
సూప‌ర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో అజాత‌శ్ర‌తువు. రోజుకు నాలుగు షిప్ట్‌లు ప‌నిచేసిన ఆయ‌న ఎడ‌తెరిపిలేకుండా శ్ర‌మించేవారు. అలాంటి ఆయ‌న ఎప్పుడూ మేక‌ప్ అతిగా వేసుకునేవారుకాదు. గ‌తంలో ర‌వితేజ సినిమాలోనూ ర‌వితేజ‌కు బాబాయ్‌గా న‌టించిన‌ప్పుడు కూడా ఆయ‌న క‌ల‌ర్‌కూ మేక‌ప్‌లేకుండా చేశార‌ని అప్ప‌ట్లో ముర‌ళీమోహ‌న్ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అలాంటిది ఇటీవ‌లే కృష్ణ‌గారి ఫేస్ తెల్ల‌టి బొల్లి మ‌చ్చ‌ల‌తో కూడిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో అభిమానుల్లో పెద్ద గంద‌ర‌గోళం నెల‌కొంది. అంద‌రూ వాక‌బుచేస్తే తేలిందేమంటే, కృష్ణ‌గారి కుమార్తె మంజుల త‌న సోష‌ల్‌మీడియాలో కృష్ణ‌గారిది పాత ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ఎక్క‌డో వుంటే దానికి బూజుదులిపిన‌ట్లు తీసి పోస్ట్ చేయ‌గానే అంద‌రూ హ‌డ‌లిపోయారు. దానిపై ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు వ‌చ్చేశాయి. దీనిపై మంజుల అభిమానుల‌కు సారీ చెప్పింది.
 
Krishna latest ph
Krishna latest ph
కాగా, ఈరోజు ఆయ‌న లేటెస్ట్ ఫొటో వ‌చ్చింది. ఎన్నో ఏళ్ళుగా ఆయ‌న ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన శ‌ర్మ అనే వ్య‌క్తి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కృష్ణ‌గారిని క‌లిసి ఆశీర్వాదం తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో నిన్న ఆయ‌న ఫొటో గురించి ప్ర‌స్తావిస్తే, అలానా!నాకు తెలేదే.  ఆ ఫొటో ఎన్నో ఏళ్ళ‌ది. ఎక్క‌డో పెడితే దానికి చెద‌లు ప‌డితే దులిపి మ‌రీ మంజుల పెట్టింద‌నుకుంట‌. అంటూ చాలా కాజువ‌ల్‌గా స‌మాధాన‌మిచ్చారు. నేను ఆరోగ్యంగానే వున్నాను. అభిమానులు, ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో ఈ స్థాయికి వ‌చ్చాన‌ని గుర్తు చేసుకోవ‌డం విశేషం.