సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (12:17 IST)

ప‌దేళ్ళు ఫ్రస్టేషన్లో వున్నా: శంక‌ర్ సినిమాపై న‌రేశ్ ఏమ‌న్నాడంటే!

Naresh VK
విజ‌య‌నిర్మ‌ల కొడుకుగా సినీరంగంలో ప్ర‌వేశించిన న‌రేశ్ త‌న కెరీర్ 50 ఏల్ళ మైలురాయికి చేరుకున్నాడు. జ‌న‌వ‌రి 19 బుధ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సీనీకెరీర్‌ను విశ్లేషిస్తూ ప‌లువిష‌యాలు వెల్ల‌డించారు. ఇప్పుడు కొత్త‌త‌రం ద‌ర్శ‌కులు రావ‌డంతో నాకు మంచి మంచి పాత్ర‌లు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు చాలా బిజీ ఆర్టిస్టుగా వున్న నేను ఓ ప‌దేళ్ళు దూరంగా వున్నా. ఆ స‌మ‌యంలో నేను ప‌డిన బాధ అంతా ఇంత‌కాదు. చాలా ప్రెస్టేష‌న్‌లోకి వెళ్ళాను. ఆ త‌ర్వాత మా అమ్మ‌, కృష్ణ‌గారు ఇచ్చిన స్పూర్తితో మ‌ర‌లా నిల‌దొక్కుకున్నా అని చెప్పారు.

 
క‌రోనాకు ముందు ఆ త‌ర్వాత కూడా మంచి పాత్ర‌లు, పెద్ద బేన‌ర్ల‌ల సినిమాలో చేస్తున్నా. రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నా. మ‌రోవైపు వెబ్ సిరీస్‌లోకూడా న‌టిస్తున్నా. ఇంకా చిన్న సినిమాలు కూడా వ‌స్తున్నాయి. దానికి పారితోషికం డిమాండ్ లేకుండా చేస్తున్నా. ఇది అమ్మ నుంచి నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు. త్వ‌ర‌లో మా అమ్మ‌పేరుతో నిర్మాణ‌రంగంలోకి రాబోతున్నాన‌ని చెప్పారు.