సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (14:23 IST)

అల్లు అర్జున్ ను మ‌ర్చిపోలేక‌పోతున్నానంటున్న‌హెగ్డే పూజ

Hegde Puja, Allu Arha
న‌టి పూజ హెడ్డే త‌న సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలైన పోస్ట్‌లు పెడుతూ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటుంది. ఇంత‌కుముందు గ్లామ‌ర్ ఫోటోలు పెట్టి అల‌రించిన ఈ భామ తాజాగా `రాములో రాములా.. అంటూ పాట‌ను పాడుతూ ఎంజాయ్ చేసేలా పోస్ట్ చేసింది.
 
కుర్చీలో కూర్చుని అల్లు అర్హ‌ను ఒళ్లో పెట్టుకుని ఆ పాట‌ను వింటూ దానికి అనుగుణంగా చేతులు మూవ్‌మెంట్స్ ఇస్తూ పాట‌పాడింది. అర్హ కూడా మూమెంట్ ఇచ్చింది. త‌న డ్రెసింగ్ రూమ్‌లో జ‌రిగిన ఈ చిన్న వీడియోను తాజాగా పోస్ట్ చేసింది. ఎందుకంటే  `అల వైకుంఠపురంలో` సినిమా  2 సంవత్సరాల సందర్బంగా చేశాన‌ని చెప్పింది. నేను డాన్స్ చేయ‌డం చూశారు మీరు. కానీ  అర్హ,  నేను డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. చూసి ఆనందించండి అంటూ పోస్ట్ చేసింది. ఈ డాన్స్ ను ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నానంటూ తెలియ‌జేసింది.