శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (16:25 IST)

పుష్ప న‌ష్టాన్ని మిగిల్చింద‌న్న పంపిణీదారులు - ఇక రెండో పార్ట్ వ‌ద్దు

Pupspha cinema
అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన `పుష్ప‌` సినిమా విడుద‌ల నుంచి నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌చ్చింది. ఫ‌స్ట్ పార్ట్‌లో స్టోరీ అనేది పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఇక రెండో పార్ట్ ఎందుకు అనే టాక్‌కూడా నెల‌కొంది. తెలుగుతోపాటు ద‌క్షిణాదిలోనూ బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం అమ్మ‌కాలు జ‌రిగి పెద్ద లాభాలు వ‌చ్చాయంటూ రోజుకో క‌లెక్ష‌న్ల రికార్డ్ అంటూ చిత్ర యూనిట్ చెబుతూ వ‌చ్చింది. అది ఒట్టి మాటేన‌ని తేలిపోయింది.
 
పుష్ప సినిమాను ఆంధ్ర‌, తెలంగాణాలో 102 కోట్ల‌కు అమ్మారు. అల‌వైకుంఠ‌పురంలో సినిమా చేసిన క‌లెక్ష‌న్లు 120 కోట్లు. దాన్ని బేస్ చేసుకుని పుష్ప కొన్నారు. కొన్న పంపిఫీదారుల‌కు సినిమాకు నెగెటివ్ టాక్ రావ‌డంతో భారీగా క‌లెక్ష‌న్లు ప‌డిపోయాయి. దాంతో చిత్ర యూనిట్ గ‌త్యంత‌రంలేక స‌క్సెస్ టూర్‌లు ఏర్పాటు చేసింది. నైజాంలో లాభాలు రాక‌పోగా జస్ట్ సేఫ్ గా నిలిచింది. 
 
ఇక ఆంధ్ర‌లో టిక్కెట్ రేట్ల త‌గ్గించ‌డంతో ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై ప‌డింది. 60 కోట్ల‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌లు కొంటే ఇప్ప‌టికి 42 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇంకా 17 కోట్లు న‌ష్టంలో కూరుకుపోయింది. పైగా అమెజాన్‌లో జ‌న‌వ‌రి 7న పుష్ప విడుద‌ల‌కావ‌డంతో ఇక థియేట‌ర్ల‌పై ఆశ‌లు వ‌దులుకున్నారు. ఇక రెండో భాగం వ‌ద్దంటూ ఆంధ్ర‌లో డిస్ట్రిబ్యూట‌ర్‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ న‌ష్టాన్ని ఎలా భ‌ర్తీచేయాలంటూ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంటో డిస్ట్రిబ్యూట‌ర్‌లు అంతా మైత్రీ మూవీస్ నిర్వాహ‌కుల‌ను క‌ల‌వ‌డంతో ఎంతో కొంత వెన‌క్కి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి పుష్ప రెండో పార్ట్ కూడా వ‌ద్దంటూ డిస్ట్రిబ్యూట‌ర్‌లు నిర్మాత‌లకు చెప్ప‌డంతో ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.