సంబంధిత వార్తలు
నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు
Naresh family
రమ్యపై ఐదుగురు మహిళలు కేసు పెట్టారట. గత కొద్దికాలం నాడు ఇదే తరహాలో శిల్పా చౌదరి కేసు కూడా బయటకు వచ్చింది. ఆమె సినిమా పరిశ్రమలోని ప్రముఖ హీరో కుటుంబీకులు ఆమె ఉచ్చులో పడ్డారు. మహేశ్ బాబు చెల్లెలు ప్రియదర్శిని కూడా శిల్ప బాధితురాలే. ఇక కొత్తగా రమ్య చేసిన ఆ ర్థిక లావాదేవీలన్నీ ఆంధ్రలోనే జరగడం విశేసం. అయితే నరేశ్ పేరు అడ్డం పెట్టుకుని చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పైగా రమ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె కావడంతో ఆమె పనులు ఈజీ అయిపోయాయి. రమ్య హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై త్వరలో ఆంధ్రలోని ప్రాంతాలను పర్యటించి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి రానున్నట్లు పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయని వార్త ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.
