బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:00 IST)

అర‌వై ఏళ్ళ‌లో కెరీర్ మొద‌లు పెట్ట‌కూడ‌దా అంటున్న‌ బ్రహ్మానందం

Brahmanandam
ఏమ్మా... కెరీర్ అంటే 20ల్లోనే మొదలు పెట్టాలా? 60ల్లో మొదలు పెట్టకూడదా?' అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది ఆయ‌న తాజాగా న‌టించిన 'పంచతంత్రం` చిత్రంలోనిది. జ‌న‌రేష‌న్ గేప్‌తో సాగే క‌థ‌. ఇందులో క‌ల‌ర్స్ స్వాతి ఆయ‌న కూతురుగా న‌టించింది. వీరి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌తోనే ఈరోజు టీజ‌ర్ విడుద‌లైంది. ఈరోజు బ్రహ్మానందం  పుట్టినరోజు. 

 
కళాబ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఈ రోజు (ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు.

 
'పంచతంత్రం'లో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక. తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు.  'జర్నీ ఆఫ్ వ్యాస్' పేరుతో విడుదల చేసిన టీజ‌ర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు. 'ఏమ్మా... కెరీర్ అంటే 20ల్లోనే మొదలు పెట్టాలా? 60ల్లో మొదలు పెట్టకూడదా?' అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది.

 
నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ "బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో మనల్ని నవ్వించారు. ఆయనలో వినోదం మాటున అద్భుతమైన నటుడు ఉన్నారు. మా సినిమాలో నటుడిగా ఆయన కొత్త పాత్రలో కనిపిస్తారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు, మా సినిమాలో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ, ఇతర వివరాలు వెల్లడిస్తాం" అని అన్నారు.

 
'పంచతంత్రం' రచయిత, దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ "నా తొలి సినిమాలో బ్రహ్మానందం గారు నటించడం ఎంతో సంతోషంగా ఉంది. వేదవ్యాస్ పాత్రలో ఆయన జీవించారు. బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకుల్లో హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. సినిమా దాదాపు రెడీ అయ్యింది" అని చెప్పారు.
 
నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.
 
సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక.