1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:58 IST)

ఆరోగ్యమే మహాభాగ్యం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. థీమ్.. Our Planet, Our Health

World Health Day 2022
World Health Day 2022
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా వుంటే అంతకంటే ఆనందం ఏముంది? అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ చిట్కాలు పాటిద్దాం.. 
 
కరోనా వేళ తప్పకుండా పరిశుభ్రత పాటించాలి.
 
చేతులు, వంట పాత్రలు, వాటిని తుడిచే క్లాత్స్, కూరగాయలను కోసే కత్తులు, పీటలపై ఏవైనా హానికరమైన సూక్ష్మక్రిములు ఉంటే అవి ఆహారంపై చేరి వ్యాధులు కలుగచేస్తాయి. తరుచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనారోగ్య ప్రమాదాన్ని నివారించవచ్చు.
 
* ఆహారం వండడానికి ముందు, తినడానికి ముందు, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు కనీసం 20 సెకండ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.
 
* పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించండి
 
* పచ్చి పండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. శుభ్రంగా కడగడం, చెక్కు తీయడం వంటివి ఈ సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి.
 
* వంటకు త్రాగడానికి పరిశుభ్రమైన నీటిని వాడండి.
 
* పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే ఉపయోగించండి. కాల పరిమితి దాటిన ఆహార పదార్థాలలో సూక్ష్మ క్రిములు పెరగవచ్చు
 
* ఆహార పదార్థాలను సరిగా ఉడికించండి
 
* ఉడికించిన ఆహారం మీరు తినే సమయానికి చల్లారిటైతే మరలా ఒకసారి వేడిచేసి తినండి.
 
* ఉడికించిన ఆహారాన్ని వేడిగా తినండి.
 
* వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకండి.
 
* వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకుంటే ఫ్రిజ్‌లో 5డిగ్రీల వద్ద ఉంచి, తినే ముందు వేడిచేయండి.
 
ఆహారాన్ని ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇకపోతే.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు నివారించదగిన పర్యావరణ కారణాల వల్ల సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య ముప్పు అయిన వాతావరణ సంక్షోభం ఇందులో ఉంది. వాతావరణ సంక్షోభం కూడా ఆరోగ్య సంక్షోభం తప్పట్లేదు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 72వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా Our Planet, Our Health థీమ్‌ను పాటించాలి.
 
ఇందుకోసం మానవాళి కాలుష్యానికి కారణం కాకూడదు. కాలుష్య కారకాలతో సంబంధం లేకుండా ఉండటానికి , పంచభూతాలను గాలి, భూమి, నీటిని కాలుష్యం చేయకూడదని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.