సీమ బాదం పప్పులో ఏమున్నదో తెలుసా?
జీడిపప్పులో కన్నా ఎక్కువ పోషక పదార్థాలు ఇందులో వున్నాయి. ఇది గొప్ప బలవర్థకమైన ఆహారం. రక్తహీనతను పోగొడుతుంది. బలహీనతను పోగొట్టి అధిక శక్తినిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. దేహపుష్టితో పాటు వీర్యపుష్టిని ఇస్తుంది. మానసిక బలాన్ని పెంచుతుంది.
సీమ బాదంలో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, ఇనుము, క్యాల్షియం, సోడియం, విటమిన్ బి, పొటాషియం, క్లోరిన్, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైన పోషక పదార్థాలు అధికంగా లభిస్తాయి. ఇతర పదార్థాలన్నిటికంటే ఇందులో లభించే క్యాలరీలు ఎక్కువ. వృద్ధాప్య లక్షణాలను త్వరగా దరిచేరనీయదు. శరీర కాంతిని పెంచుతుంది.