ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి...
టమాటా గుజ్జు రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి మాస్క్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.
అరగ్లాసు పాలు, ఒక స్పూను గంధం, అరస్పూను పసుపు కలిపి రాస్తే ముఖ చర్మం నిగనిగలాడుతుంది. మొటిమలపై వెల్లుల్లి రసాన్ని రాస్తే మొటిమలు రాకుండా నివారించవచ్చు. క్యారెట్ పేస్టుని రాసుకుని ఆరిన తరువాత కడిగితే ముఖానికి మెరుపు వస్తుంది. సమపాళ్ళలో బంగాళాదుంప, కీరదొస ముక్కల్ని తీసుకొని దానిలో ముంచిన దూదితో కంటి చూట్టూ తుడిస్తే త్వరలోనే కంటి కింద వలయాలు కనుమరుగవుతాయి.