1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. What can be done to prevent dry skin in winter?

శీతాకాలం చర్మం పొడిబారకుండా వుండాలంటే ఏం చేయాలి?

dry skin
శీతాకాలం రాగానే చర్మం పొడిబారుతుంది. పగుళ్లు వస్తాయి. విపరీతంగా నొప్పి పెడుతుంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.

 
తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి. కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది. టీ స్పూన్ కీరా జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 
బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది. రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
తర్వాతి కథనం
ఈ వెడ్డింగ్ సీజన్‌లో రిలయన్స్ జ్యువెల్స్ నుంచి క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ లైన్‌