శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (19:35 IST)

కిడ్నీల ఆరోగ్యానికి జాగ్రత్తలు (video)

కిడ్నీల ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేసేదిగా వుండేట్లు చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. 

 
అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే, వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్‌గా మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుభ్రం  చేస్తుంది.

 
కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు. దాదాపుగా 8 నుండి 10 గ్లాసుల వరకు ప్రతిరోజు తాగాలి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మూత్రం క్లియర్‌గా, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే సరిపడా నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు.

 
బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు,  ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.

 
ఆల్కహాల్, చాక్లేట్, కేఫిన్ల వల్ల చాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల, వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం చాలా మంచిది.