గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:47 IST)

డెంగూజ్వరం... తీసుకోవలిసిన జాగ్రత్తలు

ప్రస్తుతం ఉన్న జ్వరాలన్నీ డెంగీ కాదు. రెండు మూడు రకాల వైరస్‌ల కలయిక వల్ల వస్తున్న జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త తరహా జ్వరాలు దాదాపుగా డెంగీ లక్షణాలను పోలి ఉన్నాయని వైద్యనిపుణులు నిర్ధారించారు.

తీవ్రమైన జ్వరం (102 డిగ్రీలకు పైగా), తలనొప్పి, కండరాలు, కడుపులో నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. జ్వరం సోకిన ప్రతి ఒక్కరికి రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం సాధారణం. కనుక భయపడాల్సిన పనిలేదు.

డెంగూవ్యాధిలక్షణాలు
1. ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వచ్చుట
2. తలనొప్పి అధికంగా నుండును, ఎక్కువగా నొసటిపై తలనొప్పి కల్గుట
3. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గించుట, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అగుట
4. కండరాలు, కీళ్ళ నొప్పి కల్గుట
5. వాంతి అగునట్లు భ్రాంతి కల్గుట
6. నోరు ఎండిపోవును, ఎక్కువ దాహముండును
 
పై లక్షణాలు కలిగి ఉన్నచో వెంటనే మీ సమీపములో గల ఆసుపత్రినందు చూపించుకొని వ్యాధి నివారణ కొరకు చికిత్స పొందగలరు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున ప్రజలు వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి పై తెలిపిన లక్షణాల నివారణ కొరకు వెంటనే తగిన చికిత్స పొందగలరు. ఈ విషయం సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియచేయవలెను.
 
వ్యాధివ్యాపించేవిధానము
1. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమించును
2. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి జరుగును
3. ఈ దోమలు పగలే కట్టును
4. *ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాలలో నీరు నిలుచుటకు ఆవకాశం వుండి, ఆ నీరు కనీసము వారం రోజులు నిల్వ ఉన్నచో, ఈ దోమలు వృద్ధి చెందును.
5. ఈ దోమలు గ్రుడ్డు పెట్టి పెరుగుటకు ఈ క్రింద తెలిపిన వస్తువులు / పరిసరాలు అనూకూలమైనవి.*
 
ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ ల పైన నిల్చిన వాన నీరు.
 
1. ఇతర పనికిరాని, పగిలిపోయిన పస్తువులు
2. ఈ దోమ ఇంటిలో గల చీకటి ప్రదేశాలలో నివసించుచుండును
3. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్ళు
4. ఫ్లవర్ వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైనవి.పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
.
దోమల నివాసాలను తొలగించుట :
నీరు నిల్వను, పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు ఇతరత్రా కనీస అవసరాలకు ఉంచుకొని పనికిరాని వాటిని తీసివేయవలెను, ఇండ్లలోని మరియు వెలుపల నీటి నిల్వలను పాలపారబోయవలెను. నీటి ట్యాంకునకు మూతలుంచవలెను. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించుచూ వారంలో ఒక రోజు డ్రైడే (Dry Day) విధానము తప్పక పాటించుచూ రావలెను. అదే విధముగా జనవాసములందు సంఘీభావముతో పై కార్యక్రమములను పాటింపచేయవలెను.
 
బి) వ్యక్తిగత_జాగ్రత్తలు :
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చును. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించవలెను. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయవలెను.
 
చికిత్స :
ముఖ్యంగా డెంగీ వస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయని భయపడుతూ ఎంతోమంది రక్తనిధులకు పరుగులు తీస్తున్నారు. ఈ ప్లేట్‌లెట్ల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం.
 
మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది.
 
ప్లేట్‌లెట్‌లు...
* 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు.
* 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావమవ్వొచ్చు.
* 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
* 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్‌ విపరీతంగా అవుతుంది.
 
- కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్‌లెట్‌ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం.
 
రక్తస్రావమయ్యే_సూచనలు
* చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు (గుండుసూది సైజులో) ఉన్నట్టు కనబడటం.
* చిన్నపాటి దెబ్బకు కూడా ఆ ప్రాంతం కమిలిపోవటం.
* ఏదైనా గీరుకున్నప్పుడు చాలాసేపు రక్తస్రావం జరగటం.
ఈ లక్షణాలు కనబడితే మాత్రం అశ్రద్ధ చెయ్యకూడదు.
 
అల్లోపతి :
డెంగూ విషజ్వరం చాలా ప్రమాదకరమైనది. ఎయిడ్స్‌ లాగే దీనికి నివారణ తప్ప చికిత్స లేదంటారు. అయితే ఈ విషజ్వరం సోకిన వారంతా మరణిస్తారనేది అపోహ. ఇది దానంతకు అదే తగ్గాలి తప్ప మందులతో నయం అయ్యేది కాదని వైద్యులు అంటున్నారు.
 
రోగికి విశ్రాంతి అవసరము ,
జ్వరానికి " పారాసిటమాల్ "
నొప్పులకు - కొడిన్‌ ,ట్రమడాల్ , పెథిడిన్‌, పారాసెటమాల్ ,
డీహైడ్రేషం_తగ్గడానికి సెలైన్లు ,
మరేవిధమైన బాక్టీరియల్ ఇంఫెక్షన్‌ రాకుండా మంచి బ్రాడ్ స్పెక్ట్రం యాంటిబయోటిక్ ఇవ్వాలి .
పౌస్టికాహారము , అన్ని వేడి చేసి తినాలి . కారము , పులుపు , మసాలా అహారము తినకూడదు .
బ్లీడింగ్ అవకాశముంటే styptochrome లాంటి మందులు ముందుగానే ఇవ్వాలి ,
ప్లేట్ లెట్ కౌంట్ తగ్గితే 1-2 యూనిట్స్ ప్లేట్ లెట్స్ ఇవ్వాలి .
 
ఆయుర్వేద_వైద్యం
వ్యాధి లక్షణాలు తగ్గటానికి కూడా ఔషధాలు వాడుతుంది. వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క కషాయం, ఉమ్మెత్త మొక్క సారం జ్వరం నొప్పులు తగ్గడానికి వాడటం ఉంది. తులసి, పుదీనా, అల్లం, యాలకలు, దాల్చినచెక్క వగైరాలతో చేసిన కషాయం చెమట పట్టడానికి, జ్వరం తగ్గడానికి వాడతారు.
 
మూలికావైద్యం
1.డెంగ్యూ జ్వరానికి అద్భుతమైన మూలికా. చాలా త్వరగా వ్యాధిని నయంచేసేది, చౌక అయింది. తేలికగా అందరికీ అన్ని చోట్లా లభించేది. పల్లె ప్రాంతాల్లో కూడా లభించేది. పర్పుల్‌ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కషాయం . చిలగడ దుంపల పర్పుల్‌ రంగు ఆకులు ఇంత సమర్థవంతంగా పనిచేయడానికి శాస్త్రీయమైన కారణాలే ఉన్నాయి.
 
2.బొప్పాయిరసంతోడెంగీకి_విరుగుడు
బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగీ వ్యాధిని నివారించవచ్చు. బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దాన్ని వీలైనపుడల్లా తింటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆడ బొప్పాయి చెట్టు ఆకులు ... ఈనెలు ,కాండము లేకుండా మెత్తగా దంచి రసము(పసర) తీయాలి.

సుమారు 10 మి.లీ చొప్పున్న ప్రతిరోజూ ఉదయము, సాయంత్రం  త్రాగాలి. ఇలా 5 రోజులు తీసుకుంటే డెంగీ జ్వరము తగ్గుతుంది. ముఖ్యముగా ప్లేట్-లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది. దీనికి తోడుగా పారాసెటమాల్ మాత్రలు కూడా ఇవ్వాలి. నీరసము , డీహైడ్రేషన్‌ ఉంటే సెలైన్‌ ఇవ్వవలసి ఉంటుంది.
 
రక్తకణాలు (ప్లేట్‌లెట్‌ కౌంట్‌) 80 వేల కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. ఈ సందర్భంలో మరోసారి 'ఎలీసా' పరీక్ష చేయించుకుని, అందులో డెంగీ అని నిర్ధారణ అయితే అందుకు తగ్గట్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారణ కాకుంటే సాధారణ చికిత్స సరిపోతుంది.

రోగికి రక్తకణాల సంఖ్య 30 వేల వరకు ఉన్నా, డెంగీ కాకుంటే ప్రమాదం ఉండదనీ, చికిత్సతో తిరిగి రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వస్తారని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారికి రక్తం ఎక్కించాల్సిన పనిలేదంటున్నారు.