బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (14:44 IST)

కేదార్నాథ్ ఆలయం మూసివేత... ఎందుకు?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం మూసివేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు తెలిపింది. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల అనంతరం కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు.
 
అదేవిధంగా యమునోత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు యమునోత్రిని మూసివేశారు. యమునా దేవి, ఆమె సోదరుడు షాని మహరాజ్, తల్లి భోగ్మూర్తి ఉత్సవ్ డోలీలను ఊరేగింపుగా జంకి ఛాటి సమీపంలోని ఖర్సాలీ గ్రామానికి తరలించారు. మరోవైపు గంగోత్రి ఆలయాన్ని శుక్రవారం మూసివేయగా బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 20న మూసివేయనున్నట్టు తెలిసింది.