శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:29 IST)

ఆరోగ్యం, శ్రేయస్సు కోసం గుప్పెడు బాదములు తీసుకోండి

ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్‌ 7వ తేదీ నిర్వహిస్తుంటారు. తద్వారా ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం మనిషితో పాటుగా భూగోళాన్ని సైతం ఆరోగ్యంగా మలచడం, సంక్షేమం దిశగా సమాజం దృష్టి సారించేలా ప్రోత్సహించడం.

 
ఊబకాయం, మధుమేహం, కార్డియోవ్యాధులు లాంటి ఆందోళనలు తీవ్రమవుతుండటంతో మన ఆరోగ్యం పట్ల మనం తగినంతగా శ్రద్ధ చూపడం అవసరం. మన సాధారణ ఆరోగ్యంతో పాటుగా సంక్షేమం మెరుగుపరచడం కోసం ఓ చక్కటి పద్దతి ఆలోచనాత్మక ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడం. కొవ్వు పదార్ధాలతో పాటుగా చక్కెర అధికంగా కలిగిన ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం, శీతలపానీయాలు తీసుకోకపోవడం, ఆరోగ్యవంతమైన భోజనాలు తీసుకోవడం, స్నాక్స్‌ కూడా అదే తరహాలో తీసుకోవడమనేది ఆరోగ్యవంతమైన జీవనానికి తొలి అడుగుగా నిలుస్తుంది.

 
ఈ తరహా ఆహారానికి అత్యుత్తమ ఉదాహరణగా బాదములు నిలుస్తాయి. దీనిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి విటమిన్‌ ఈ, రాగి, జింక్‌, ఫోలెట్‌, ఐరన్‌ కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.  అంతేకాదు, డైటరీ ఫైబర్స్‌కు ఇవి అత్యుత్తమ ఉదాహరణలుగానూ నిలుస్తాయి.

 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ నేడు మనలో చాలామంది తక్షణ సంతృప్తిని అందించే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. అనారోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకోవడం వల్ల నేడు సంతృప్తికరంగా ఉండొచ్చు కానీ తరువాత కాలంలో సమస్యలకు కారణం కావొచ్చు. అందువల్ల మనం తీసుకునే ఆహారం పట్ల పూర్తి నియంత్రణతో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి రోజూ మనం తీసుకునే, ఎంచుకునే ఆహార ప్రాధాన్యతలు ఆరోగ్యవంతమై ఉండాలి. మన డైట్‌లో బాదములు తీసుకోవడం మంచిది. బాదములలో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబో ఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉండాల్సి ఉంది. ఇవన్నీ కూడా శరీరం చక్కగా పనిచేసేందుకు అత్యుత్తమం’’ అని అన్నారు.

 
భారతీయ టెలివిజన్‌ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘నా వరకూ, నా కుటుంబ ఆరోగ్యం నాకు అత్యంత ప్రాధాన్యతాంశం. వారు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ప్రతిరోజూ మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఓ గుప్పెడు బాదములు తినాలని కోరుకుంటుంటాను. ఈ రోజువారీ పద్ధతి నాతో పాటుగా నా కుటుంబ రోగ నిరోధక శక్తిని కూడా గణనీయంగా పెంచుతుంది. బాదములలో రాగి, జింక్‌,  ఐరన్‌ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి, ఎదుగుదలకు సహాయపడతాయి. అలాగే సాధారణ రోగనిరోధక శక్తి నిర్వహణలోనూ తోడ్పడుతుంది. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవవేళ, నేను దీనిని కొనసాగించడంతో పాటుగా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహార ప్రక్రియలో బాదములను భాగం  చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని అన్నారు.

 
కన్నడ నటి, సెలబ్రిటీ ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ, ‘‘మన వేగవంతమైన జీవనశైలిలో, మనం మన ఆరోగ్యం పట్ల అప్రమత్తతో వ్యవహరించడం కీలకం. ప్రస్తుత కాలంలో నూతన, వినూత్న మార్గాలలో అనుకూలమైన మార్గాలను స్వీకరించడం వలన ఆరోగ్యకరమైన ఫలితాలను సాధించగలము. చక్కటి ఆరోగ్య ప్రయాణ ప్రారంభం కోసం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మించిన మార్గమేముంది? ప్రతి ఒక్కరికీ నా సలహా ఏమిటంటే, వారి డైట్‌లో బాదములను జోడించుకోమనేది. విటమిన్‌ ఇ,  ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, కాల్షియం మొదలైన 15 పోషకాలు బాదములో ఉంటాయి. బాదములలో విటమిన్‌ ఈ  కంటెంట్‌ ఉంది. ఇది పల్మనరీ ఇమ్యూన్‌ పంక్షన్‌కు మద్దతునందిస్తుంది. బాదములు ఆరోగ్యవంతమైన కొవ్వులు, ప్రొటీన్‌, ఫైబర్‌ను అందిస్తుంది. ఇవన్నీ కూడా తృప్తిని అందించడంతో పాటుగా ఆకలిని అదుపులో ఉంచుతాయి’’ అని అన్నారు.

 
ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరినీ దీని ఆవశ్యకతను గుర్తించేలా చేసింది. అందువల్ల, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితానికి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ ప్రతిజ్ఞ చేయండి.