గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:40 IST)

భార్య కోర్కె తీర్చేందుకు ఖైదీ భర్తను 15 రోజుల పాటు విడుదల చేయాలన్న హైకోర్టు

court
అతడు ఓ నేరంలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే తన భర్త జైలుపాలు కావడంతో అతడి భార్య కోర్టుకి ఓ పిటీషన్ దాఖలు చేసింది. తను సంతానం పొందేందుకు తన భర్తను విడుదల చేయాలంటూ అందులో అభ్యర్థించింది.

 
పూర్తి వివరాలు చూస్తే.. రాజస్థాన్ హైకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. భార్య గర్భధారణ కోసమని నందలాల్ అనే జీవిత ఖైదీకి 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది.

 
ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. నందలాల్ భార్య అమాయకురాలు, భర్తకి కారాగారం విధించడంతో ఆమెకి వైవాహిక జీవితంలో భాగమైన శృంగార, భావోద్వేగ అవసరాలు దూరమయ్యాయి. సంతానం పొందే హక్కు ఖైదికి కూడా వుంటుంది కనుక ఖైదీ భార్య చేసుకున్న విజ్ఞప్తికి 15 రోజుల పాటు పెరోల్ పైన ఖైదీని విడుదల చేయాలని ఆదేశించింది.