శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:02 IST)

తెలంగాణలో హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

telangana high court
తెలంగాణలో ఉద్యోగాల జాతర ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా హైకోర్టులో వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
మొత్తం పోస్టుల్లో రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1, జాయింట్‌ రిజిస్ట్రార్‌ 3, డిప్యూటీ రిజిస్ట్రార్‌ 5, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 4, సెక్షన్‌ ఆఫీసర్స్‌/స్క్రూటినీ ఆఫీసర్స్‌ 96, కోర్టు మాస్టర్స్‌/పీఎస్‌ టు జడ్జెస్‌ 59, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్స్‌/ట్రాన్స్‌లేటర్‌ 78, కంప్యూటర్‌ ఆపరేటర్‌ 12 వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చునని తెలిపింది.