శనివారం, 17 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (16:23 IST)

చల్లటి కబురు... తెలంగాణాలో రెండు రోజులు పాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. 
 
మరోవైపు, మండుటెండలతో తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించేలా ఉంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మంగళవారం ఎండలు మండిపోయాయి. ఎల్బీ నగరులో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.