సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (11:30 IST)

స్వర్ణ దేవాలయం సేవ‌లో ఉపాస‌న‌

Upasana, Swarna Temple
Upasana, Swarna Temple
రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిన్న‌వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సిక్కుల సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆమె దేవాల‌యాన్ని ద‌ర్శించుకుని చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. 
 
ఇలాంటి సేవ చేస్తాన‌ని అనుకోలేద‌నీ, రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్‌.సి. 15 చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఇలా పాల్గొనే అవ‌కాశం క‌ల్గింద‌ని ఆమె పేర్కొన్నారు. ఇక్క‌డి వాతావ‌ర‌ణం, వారి ప్రేమ ఎంత‌గానో సంతృప్తినిచ్చాయ‌న్నారు. ఇలాంటి అవ‌కాశం ల‌భించిందుకు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
 
రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌ధార తారాగ‌ణ పాల్గొన్న కొన్ని కీల‌క స‌న్నివేశాలు అమృత్‌స‌ర్‌లోనూ ప‌రిస‌ర ప్రాంతాల‌లోనూ చిత్రీక‌రించారు.