సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:12 IST)

శంకర్ సినిమాలో రాజకీయ నేతగా చెర్రీ... ద్విపాత్రాభినయం

ram charan
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. అయితే, ఈ చిత్రంలోని ఓ స్టిల్ తాజాగా సోషల్ మీడియాలో లీకైంది. ఇందులో చెర్రీ తెల్లని వస్త్రాల్లో సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు. ఆయన వేషధారణ రాజకీయ నేతను తలపిస్తుంది. పైగా, ఈ చిత్రంలో చెర్రీ తండ్రీతనయులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 
1980ల నాటి రాజకీయ నాయకుడిలా చరణ్ కనిపిస్తున్నారు. దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కథకు సంబంధించిన ఫోటోనే ఇదని నెటిజన్లు అంటున్నారు. పైగా, ఈ చిత్రంలో చెర్రీ తండ్రీకొడుకులుగా రెండు షేడ్స్‌లలో కనిపించనున్నారు. తండ్రిబాటలో ఐఏఎస్‌గా ఉన్న తనయుడు రాజకీయ నాయకుడిగా మారతారట. కథ మాట అటుంచితే ఈ ఫోటోను మాత్రం చెర్రీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.