సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (11:20 IST)

యూపీలో ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీక్ - ఆ జిల్లాల్లో పరీక్షలు రద్దు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాలీ ఇంగ్లీష్ పరీక్షా పత్రం లీకైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ ప్రకటించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేసినట్టు ప్రకటించింది. 
 
ఇంటర్ ద్వితీయ పరీక్ష పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పేపర్ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించారు. 
 
ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.