శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (22:02 IST)

రామ్ చరణ్ సరసన అంజలి.. సెట్ అవుతుందా?

anjali
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాపై ఓ ఆసక్తికర సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
తాజాగా మరొక హీరోయిన్ పేరు వినిపిస్తోంది. హీరోయిన్ మరెవరో కాదు తెలుగు సినీ నటి అయిన అంజలి. రామ్ చరణ్ కు జోడీగా హీరోయిన్ అంజలి నటించబోతున్నట్లు జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. 
 
ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు అని సమాచారం. సీనియర్ రామ్ చరణ్ సరసన అంజలి నటిస్తుండగా, జూనియర్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
 
ఇటీవలే ఈ చిత్ర బృందం రాజమండ్రిలో సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.