శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (15:43 IST)

'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ ఇంట విషాదం

గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం "రేసుగుర్రం". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు రవికిషన్. ఇపుడు ఆయన నివాసంలో ఇపుడు విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేష్ శుక్లా గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 
 
తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని రవికిషన్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. తన సోదరుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. తన తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదరుడు కూడా మృతి చెందడం తమ కుటుంబాన్ని కలిచివేస్తుందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.